
ఇనయా సుల్తానా..ఇంతవరకూ చేస్తూ వెళ్లింది చిన్న చిన్న పాత్రలే అయినా, యూత్ లో తనకి క్రేజ్ ఉంది. ‘బిగ్ బాస్ 6’ లోను కనిపించి సందడి చేసిన ఇనయా, తాజాగా ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “నేను ఊరు నుంచి వచ్చాను..ఎలా ఉండాలి.. ఎలా మాట్లాడాలి..ఎలా కనిపించాలి అనే విషయాలు కూడా అప్పటికి నాకు తెలియదు. కానీ ఆ తరువాత నేర్చుకుంటూ వచ్చాను” అని అన్నారు..
‘బిగ్ బాస్ సీజన్ 6’లో నేను ఉన్నాను. 14 వారాల పాటు సందడి చేశాను. ఆ తరువాత కూడా నాకు సినిమాలలో ఛాన్సులు రాలేదు. దాదాపు ఏడాది పాటు ఏ సినిమా చేయలేదు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతానేమోనని భయం వేసింది. దాంతో మళ్లీ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. అప్పుడే మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. అయితే అలా నేను చేసిన సినిమాలలో చాలా సీన్స్ ఎడిటింగ్ లో పోవడం బాధను కలిగించింది” అని చెప్పారు..!!

