
పెళ్లి సందడి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ మేక. డాన్సుల్లో తన ప్రతిభ చూపించుకోగలిగాడు. అయితే క్రెడిట్ మొత్తం శ్రీలీల పట్టుకెళ్లిపోయింది. ఇప్పుడు ‘ఛాంపియన్’ సినిమాతో మరో ప్రయత్నం చేశాడు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫైనల్ రిజల్ట్ తేలాలంటే..మరో రెండు రోజులు ఆగాలి. ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు చేజిక్కించుకొంటున్నాడు రోషన్..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రోషన్ తో ఓ సినిమా చేయబోతోంది. ఇప్పటికే ఓ కథ రెడీ చేసినట్టు సమాచారం. మరోవైపు స్వప్నదత్, ప్రియాంకా దత్ కూడా రోషన్ తో మరో సినిమా చేసే ప్లాన్ లోఉన్నారని సమాచారం. ఇంద్రగంటి మోహనకృష్ణ, శైలేష్ కొలను రోషన్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ మీనన్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. గౌతమ్ మీనన్ – రోషన్ మధ్య సంప్రదింపులు జరిగాయని, ఈ కథ రోషన్‌కి బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే..‘ఛాంపియన్’ తరవాత రోషన్ సినిమా ఇదే కావొచ్చు..!!
