
దిరాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు మారుతి, చిత్రబృందం మొత్తం హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కార్యక్రమాన్ని పండగలా మార్చారు. ప్రభాస్ ఎంట్రీతోనే ప్రాంగణం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. అభిమానుల ఉత్సాహం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు..
ముఖ్యంగా హీరోయిన్ రిద్ధి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభాస్ గారి కోసం సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేయడం ఒక మధురమైన అనుభవం. మూడు సంవత్సరాల క్రితం ప్రభాస్ గారు నాకు కానుకగా ఇచ్చిన చీరనే ఈ రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధరించి వచ్చాను అని రిద్ధి చెప్పగానే హాల్ మొత్తం చప్పట్లతో, హర్షధ్వానాలతో మార్మోగింది..!!

