in

Rashmika Mandanna Calls 2025 a Proud Year for Her!

2025 తనకు ఎంతో గర్వంగా అనిపించే సంవత్సరమని చెప్పిన రష్మిక, ప్రతి ఏడాది ఇలాగే ఉంటుందనే గ్యారంటీ లేకపోయినా ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా సంతృప్తినిచ్చిందని తెలిపారు. తాను చేసిన పనుల వల్ల కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉండటం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని, ప్రేక్షకుల నుంచి లభించిన ప్రేమ తనకు గొప్ప బహుమతిగా భావిస్తున్నానని పేర్కొన్నారు..

తాను ముందుగా ఒక నటిని, ఎంటర్‌టైనర్‌ని అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోనని చెప్పిన రష్మిక, ఒకే ఇమేజ్‌లో ఇరుక్కోకుండా విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. తనను కేవలం మంచి అమ్మాయి లేదా అమాయక పాత్రలకే పరిమితం చేయకుండా, నటిగా ఎదుగుతున్న వ్యక్తిగా ప్రేక్షకులు చూడాలని ఆశిస్తున్నానని చెప్పారు. అందుకే కథ నచ్చితే దర్శకులు, రచయితలపై పూర్తి నమ్మకంతో పని చేస్తానని స్పష్టం చేశారు..!!

happy birthday naveen polishetty!

WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!