
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరున్న కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ అందిస్తున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా ఆరంభంలో రవితేజ పాత్రను పరిచయం చేసేందుకు, అలాగే కథలోని కొన్ని కీలక సందర్భాల్లో చిరంజీవి తన గంభీర స్వరంతో వ్యాఖ్యానం అందించనున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ వాయిస్ ఓవర్ తోడవ్వడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగిందని, ఇది ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చిత్రబృందం భావిస్తోంది. ఈ వార్తతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. మరోవైపు, ఈ చిత్రం విడుదల కాకముందే భారీ వ్యాపార ఒప్పందాలను పూర్తి చేసుకుంది..!!

