
మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్ర ఉందని..దానికోసం చరణ్‌ను అప్రోచ్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఐతే, పెద్ది బిజీలో ఉన్న చరణ్, మనోజ్ కోసం కేమియో రోల్ చేస్తాడా..? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వార్త పై తాజాగా మనోజ్ స్పందించారు. బుధవారం నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో మనోజ్ మాట్లాడుతూ..
సినిమాలో అయితే అతిథి పాత్రలకు మంచి స్కోప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు..కాకపోతే, ఇప్పటి వరకూ తమ చిత్రబృందం ఎవరినీ సంప్రదించలేదని మనోజ్ చెప్పుకొచ్చారు. మనోజ్ ఇంకా మాట్లాడుతూ..‘రీ ఎంట్రీలో నేను ‘ఉస్తాద్’ షో చేశా. ‘భైరవం’, ‘మిరాయ్’లాంటి సినిమాల్లో నటించా. ఆ సమయంలో కొందరు నన్ను తొక్కేయాలని చూశారు. కానీ, అభిమానులు నన్ను ఆదరించారు. వారి ప్రేమ నాపై ఉన్నంత వరకూ నన్నెవరూ ఏం చేయలేరు’ అంటూ మనోజ్ చెప్పుకొచ్చారు..!!
