
టాలీవుడ్‌లో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ మెహ్రీన్ పీర్జాదా. ఆ తర్వాత అమ్మడు చాలా సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది..అయితే, ఇటీవల చాలా తక్కువగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా మెహ్రీన్ పెళ్లి చేసుకుందంటూ ఓ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తుంది. అయితే, తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ను ఆమె ఖండించారు. తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని.. అసలు ఈ విషయంపై తాను రియాక్ట్ కాకూడదని అనుకున్నానని..కానీ, తనకు ఎవరో తెలియని వ్యక్తితో పెళ్లి అయిందనే వార్తలు రావడంతో తాను స్పందించాల్సి వచ్చిందని మెహ్రీన్ కామెంట్ చేసింది. తన పెళ్లి గురించి అందరికీ చెప్పి మరీ చేసుకుంటానని ఆమె క్లారిటీ ఇచ్చింది. దీంతో మెహ్రీన్ పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పడింది..!!
