
జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో శ్రీలీల కెరీర్ దూసుకు వెళుతోంది. ఫ్లాపులు వచ్చినప్పటికీ..స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఆమెకు దక్కుతోంది. రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా..నెక్స్ట్ ఆవిడ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉంది. వచ్చే ఏడాది ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగు సంగతి పక్కన పెడితే..సంక్రాంతికి తమిళ తెరపై అడుగు పెట్టడానికి శ్రీ లీల రెడీ అవుతోంది. ఆ సినిమా పేరు ‘పరాశక్తి’..
శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ఆ చిత్రానికి బంపర్ ఆఫర్ తగిలింది..శివ కార్తికేయన్ కథానాయకుడిగా ‘గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పరాశక్తి’. ఇందులో జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్వర్క్ జీ 5 సొంతం చేసుకుంది. అది కూడా 52 కోట్ల రూపాయలకు..!!
