
హీరో నాగార్జున పై తమిళ హీరో విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి తనకు నాగార్జున అంటే చాలా అభిమానమని, ఆయన మూవీస్ అస్సలు మిస్ కాకుండా చూస్తు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే..అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాగార్జునలో ఎలాంటి మార్పులు కన్పించడంలేదన్నారు.
ఇప్పటికి కూడా చాలా యంగ్ గా కన్పిస్తున్నారన్నారు. తన మనవళ్లు కూడా పెద్దవారిలా మారిపోయారని కానీ నాగార్జునలో ఏ మాత్రంమార్పు రాలేదన్నారు. అసలు ఆయనకు వయసు ఎందుకు పెరగడం లేదో తనకు అర్థం కావట్లేదని ఫన్నీగా మాట్లాడారు. ఈ క్రమంలో నాగార్జున గురించి విజయ్ సేతుపతి ఈ విధంగా మాట్లాడారు. అంతటితోఆగకుండా.. యాంటీ ఏజింగ్పై పరిశోధనలు చేసేవాళ్లు నాగార్జునపై టెస్టులు చేయాలని కూడా సరదాగా మాట్లాడారు..!!
