in

Krithi Shetty: ‘i Can Work for 24 Hours all day long’

తాను నటించిన కొత్త తమిళ చిత్రం ‘వా వాతియార్’ ప్రమోషన్‌లో భాగంగా ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడారు. “సినిమాలో అందరి పని విధానం ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరూ విభిన్నంగా ఉంటారు. ముఖ్యంగా నటీమణులు తమ జీవనశైలి, పని విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు. కాబట్టి, ఎవరికి ఏది సౌకర్యంగా ఉంటుందనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది” అని ఆమె వివరించారు.

తన వ్యక్తిగత అభిప్రాయం గురించి చెబుతూ, “నాకు ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు తక్కువ. శక్తి ఉన్నంతవరకు అవసరమైతే 24 గంటలు పనిచేయడానికైనా నేను సిద్ధం. నేను ఒక డైరెక్టర్ అనుకూల యాక్టర్‌ను. 13 గంటలు నేను సెట్‌లో ఉండాలని దర్శకుడు కోరుకుంటే కచ్చితంగా ఉంటాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకేసారి హైదరాబాద్, చెన్నైలలో డబుల్ షిఫ్టులు కూడా చేశాను. అయితే, ఎవరైనా తక్కువ గంటలు పనిచేస్తామంటే దాన్ని నేను తప్పుగా చూడను..అది వారి అభిప్రాయం” అని కృతి పేర్కొన్నారు..!!

TAMANNAAH’s SPECIAL SONG IN ALLU ARJUN – ATLEE’S FILM!

its official: Akhanda 2 New Release Date Announced!