in

Akkineni Hero to Join Hands with Prashanth Neel?

కెరీర్‌లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ‘లెనిన్’ అనే చిత్రంలో నటిస్తున్న ఆయన, తాజాగా ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సమావేశం కావడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్ చిత్రం రాబోతోందంటూ వార్తలు ఊపందుకున్నాయి.

అయితే, ఈ వార్తలపై తాజాగా మరో సమాచారం బయటకు వచ్చింది. అఖిల్‌తో సినిమా రాబోతున్న మాట వాస్తవమే అయినా, దానికి దర్శకత్వం వహించేది ప్రశాంత్ నీల్ కాదని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వ బృందంలోని ఓ కీలక సభ్యుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సమావేశం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చల కోసమేనని సమాచారం. ఈ భేటీలోనే దర్శకుడి ఎంపికపై కూడా ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది..!!

Krithi Shetty: 'I Saw a Ghost in My Hotel Room

Krithi Shetty: ‘I Saw a Ghost in My Hotel Room’

Bhagyashri Borse reacts to faith win hearts!