in

Prabhas remuneration becomes talk of the town!

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన స్టార్‌డమ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగింది. ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, ది రాజా సాబ్ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అయితే, ఈ సమయంలో ఆయన రెమ్యునరేషన్ విషయంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. స్పిరిట్ చిత్రం కోసం ప్రభాస్ రూ.160 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

దీంతో ఆయన టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిచారు..గత కొన్ని సంవత్సరాల్లో ఆయన రెమ్యూనరేషన్ రూ.100 – రూ.150 కోట్ల వరకు పెరిగింది. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్, గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కారణంగా బాలీవుడ్, టాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆయనతో వరుసగా సినిమాలు చేస్తున్నాయి. అమెరికా, యూరప్, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్స్‌లో కూడా ఆయన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారణంతోనే ప్రభాస్ రెమ్యునరేషన్ ఆ స్థాయిలో ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు..!!

Keerthy Suresh Becomes UNICEF India’s Celebrity Advocate!

kannada actress Chaitra J Achar makes her tollywood debut!