in

Dulquer Salmaan Admits To Being “Pushed Around” In Bollywood!

హిందీలో పెద్ద స్టార్ అనిపించుకోకపోతే తీవ్రమైన నిర్లక్ష్యానికి గురికావాల్సి వస్తుందని తన అనుభవాలను పంచుకున్నారు. ఓ తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ..”బాలీవుడ్‌లో నటించేటప్పుడు, నేను స్టార్ అని అందరినీ నమ్మించాల్సి వచ్చేది. నా చుట్టూ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉండేవారు. మనం లగ్జరీ కారులో వస్తేనే మనల్ని స్టార్‌గా గుర్తిస్తారు..

అలా లేకపోతే సెట్‌లో కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఇవ్వరు, మానిటర్ చూడటానికి కూడా స్థలం కేటాయించరు” అని అన్నారు..2018లో ‘కార్వాన్’ చిత్రంతో దుల్కర్ హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మలయాళ చిత్ర పరిశ్రమ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని దుల్కర్ వివరించారు. “మా ఇండస్ట్రీలో సినిమాలకు ఎక్కువ ఖర్చు ఉండదు. ఇక్కడ లగ్జరీకి ఎవరూ ప్రాధాన్యం ఇవ్వరు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. చాలా వస్తువులు ఇంటి నుంచే తెచ్చుకుంటాం” అని రెండు పరిశ్రమల మధ్య ఉన్న తేడాను స్పష్టం చేశారు..!!

ravi teja – Shiva Nirvana combo to have 6 heroines?

Janhvi Kapoor slams out memes on Sridevi, Dharmendra’s deaths!