in

Tamannaah Bhatia joins Siddhant Chaturvedi in ‘V Shantaram biopic’!

కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న నటి తమన్నా భాటియాకు బాలీవుడ్ నుంచి మరో ప్రతిష్ఠాత్మక అవకాశం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. భారతీయ సినిమా దిగ్గజ దర్శకుల్లో ఒకరైన వి. శాంతారాం జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో ఆమె నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో శాంతారాం భార్య, అలనాటి ప్రముఖ నటి సంధ్య పాత్రలో తమన్నా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘చిత్రపతి వి. శాంతారాం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ‘నటసామ్రాట్’ చిత్ర దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. వి. శాంతారాం దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో సంధ్య హీరోయిన్‌గా నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ బయోపిక్‌లో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి..!!

Another noted Bollywood Actress in prabhas Spirit?