
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో..నేషనల్ క్రష్ రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడింది. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా..ఇందులో రష్మిక నటనకు మాత్రం విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి..
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చేసింది. డిసెంబర్ 5, 2025 నుంచి ‘ది గర్ల్‌ఫ్రెండ్’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం..ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో..రావు రమేష్, అను ఇమ్మాన్యుయేల్, రోహిణి కీలక పాత్రల్లో మెరిశారు..!!
