in

Pawan Kalyan – Lokesh Kanagaraj Combination on cards!

క్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సృష్టించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ ఇప్పుడు తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆయన ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు సమాచారం.

‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో గ్యాంగ్‌స్టర్ డ్రామాలను కొత్తగా ఆవిష్కరించిన లోకేశ్‌, ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్-కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం లోకేశ్‌ ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి, పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నటించేందుకు పవన్ కూడా సుముఖంగా ఉన్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది..!!

Andhra King Taluka!