in

girja oka ‘National Crush’ to Target of Harassment!

ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇటీవల అధికమయ్యాయి. దీని కారణంగా వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరాఠీ నటి గిరిజా ఓక్ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన గిరిజా ఓక్, ఇటీవల ఒక చిన్న వీడియో క్లిప్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. దీంతో ఆమెను అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది..

అయితే, ఈ పాప్యులారిటీ సినిమా అవకాశాలు తీసుకురాకపోగా, తీవ్రమైన వేధింపులను తెచ్చిపెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వచ్చిన పాప్యులారిటీ వల్ల జీవితంలో పెద్దగా మార్పు రాలేదని, కానీ అసభ్యకరమైన కామెంట్లు, మెసేజ్‌లు మాత్రం విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. “నీ రేటు ఎంత?”, “ఒక గంటకు ఎంత తీసుకుంటావు?” లాంటి నీచమైన సందేశాలు రోజూ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు..!!

36 YEARS FOR ‘AHA NAA PELLANTA’

SHORT AND SWEET STORY BEHIND THE NAME!