
దక్షిణాది సీనియర్ నటి త్రిష కృష్ణన్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తన పెళ్లి, రాజకీయ రంగ ప్రవేశం గురించి వస్తున్న పుకార్లను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. స్నేహితులతో దిగిన ఫొటోలను వక్రీకరించి, అవాస్తవ కథనాలను జోడించి ప్రచారం చేయడంపై త్రిష మండిపడ్డారు..
“నేను ఎవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి జరిగినట్టేనా ? ఇంకా ఎంతమందితో నా పెళ్లి చేస్తారు?” అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధార వార్తలు తనకు అసహ్యం కలిగిస్తున్నాయని, ఫేక్ న్యూస్ ప్రచారాన్ని వెంటనే ఆపాలని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. ఇక సినిమాల విషయానికొస్తే, త్రిష చాలా కాలం తర్వాత తెలుగులో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో ఆమె హీరోయిన్గా చేస్తున్నారు..!!

