in

Sonakshi Sinha praises Telugu film industry as ‘very disciplined’!

ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “నేను గతంలో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. దక్షిణాది సినీ పరిశ్రమలో కొన్ని విషయాలు నాకు బాగా నచ్చాయి, ముఖ్యంగా ఇక్కడి సమయపాలన అద్భుతం. టాలీవుడ్‌లో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలైతే సాయంత్రం 6 గంటల కల్లా కచ్చితంగా పూర్తిచేస్తారు. దీనికి ఎంతో క్రమశిక్షణ అవసరం. కానీ హిందీ పరిశ్రమలో ఇలాంటి వాతావరణం ఉండదు..

అక్కడ సమయపాలన పాటించరు, అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఆ పద్ధతి నాకు అస్సలు నచ్చదు. ఈ విషయంలో టాలీవుడ్‌ను చూసి హిందీ వాళ్లు మారాలని కోరుకుంటున్నాను” అని సోనాక్షి సిన్హా స్పష్టం చేశారు. గతంలో ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించాలని ఆసక్తి ఉన్నప్పటికీ, డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్లే కుదరలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక ‘జటాధర’ విషయానికొస్తే, ఈ చిత్రంలో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు..!!

Vishnupriya Bhimeneni sensational comments on bigboss experience!

beauty sreeleela getting out from her comfort zone!