
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘దే దే ప్యార్ దే 2’ సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేశారు. ఈ పాటలో రకుల్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే గ్లామర్ డోస్ కాస్తా ఎక్కువైందనే చెప్పాలి. ముఖ్యంగా ఒక స్టెప్పులో అజయ్, రకుల్ ఛాతీపై వాలి డ్యాన్స్ చేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
ఈ వయసులో వివాహిత నటితో ఇంత అసభ్యకరంగా డ్యాన్స్ చేయాలా? అంటూ అజయ్ దేవగన్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా చూస్తే అజయ్ భార్య కాజోల్ ఇంట్లో గట్టిగానే క్లాస్ పీకుతుంది అంటూ ఫన్నీ మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. సినిమాకు హైప్ పెంచే ప్రయత్నంలో భాగంగానే రకుల్ ఇటువంటి స్టైలింగ్‌ను ఎంచుకున్నారా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఏది ఏమైనా, ‘దే దే ప్యార్ దే 2’ సినిమా కంటే కూడా రకుల్ డ్రెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పడిందనేది వాస్తవం. అవకాశాలు కోసమే రకుల్ ఇలా అందాలు ఆరబోస్తుందంటూ నెటిజన్లు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు..!!

