
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కథానాయిక రష్మిక వేరే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు.
ఈ వేడుకకు విజయ్ దేవరకొండను ఆహ్వానించాలని భావించామని, కానీ రష్మికే అందుబాటులో లేనప్పుడు ఆయనను పిలవడంలో అర్థం లేదని అల్లు అరవింద్ చమత్కరించారు. “హీరోయిన్ రష్మిక కాబట్టి విజయ్‌ను పిలిస్తే బాగుంటుందనుకున్నాం. కానీ ఆమే రానప్పుడు, విజయ్ వచ్చి ఏం లాభం?” అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా గురించి మాట్లాడుతూ, బడ్జెట్ పరంగా ఇది తనకు ఒక రిస్క్ అని అల్లు అరవింద్ అన్నారు..!!

