in

Roja marks her re-entry into films after 12 years!

కప్పుడు వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా మళ్లీ ఇండస్ట్రీలో సందడి చేయబోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయాలకు తాత్కాలికంగా దూరమైన ఆమె, తన సినీ కెరీర్‌పై దృష్టి సారించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఓ తమిళ చిత్రంతో ఆమె గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వార్తతో ఆమె అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

తమిళ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘లెనిన్ పాండ్యన్’ చిత్రంలో రోజా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. డి.డి. బాలచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోజా రీ-ఎంట్రీని ప్రకటిస్తూ ఆమె స్నేహితురాలు, నటి ఖుష్బూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 90ల నాటి రోజా హిట్ సినిమాల్లోని క్లిప్స్‌తో పాటు, కొత్త సినిమాలోని ఆమె లుక్‌ను ఈ వీడియోలో చూపించారు. “90s క్వీన్ ఈజ్ బ్యాక్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది..!!

rashmika’s ‘the girl friend’ pre release event cancelled!

kumbh mela viral girl Monalisa Bhosle makes tollywood debut!