
ఇటీవల ‘యువా’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, “నాకు అబద్ధాలు చెప్పేవాళ్లను చూస్తే అస్సలు సహించలేను. ఏదైనా తప్పు జరిగినా, సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. అవసరమైతే మీరు ఒక హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి నేను సాయం చేస్తానేమో (నవ్వుతూ)..
కానీ, అబద్ధాలు చెప్పే వారిని మాత్రం నేను భరించలేను” అని అన్నారు. ఆమె ఇంకా వివరిస్తూ, “నా ముఖం మీదే అబద్ధం చెప్పి, దాన్ని నేను నమ్మేంత మూర్ఖురాలిని అని అవతలి వారు అనుకున్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. సమస్య కేవలం అబద్ధం చెప్పడం కాదు, అవతలి వారు మనల్ని అంత తెలివితక్కువ వారని భావించడమే అసలు సమస్య” అని తమన్నా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు..!!

