in

beauty sreeleela in danger of being called as iron leg!

త‌న‌పై ప‌డిన ఐరెన్ లెగ్ ముద్ర చెరిపేయాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్ట‌డం త‌ప్ప‌ని స‌రి అనే సంగ‌తి శ్రీ‌లీల‌కు కూడా బాగా తెలుసు. అందుకే ‘మాస్ జాత‌ర‌’పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేసింది. ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా కొంచెం ఎగ్ర‌సీవ్ గా పాల్గొంటోంది. ”నా కెరీర్‌లో పెద్ద‌గా ప్ర‌యోగాలు చేసే అవ‌కాశం నాకు రాలేదు. ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనే న‌టించాను. ఇప్ప‌టికీ ఆ జోన‌ర్ అంటేనే నాకు ఇష్టం.

స‌డ‌న్ గా నా కెరీర్ గ్రాఫ్ మార్చుకోవాల‌ని, ప్ర‌యోగాలు చేయాల‌ని నాకు లేదు..నాకు కంఫ‌ర్ట్ ఉన్నంత కాలం ఈ త‌ర‌హా రోల్స్ చేస్తూనే ఉంటా. మాస్ జాత‌ర‌లో నేను కొత్త‌గా క‌నిపిస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ త‌ర‌హా పాత్ర ఇంత వ‌ర‌కూ చేయ‌లేదు” అని న‌మ్మ‌కంగా చెబుతోంది శ్రీ‌లీల‌. ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ లోనూ శ్రీ‌లీల న‌టిస్తున్న సంగతి తెలిసిందే. త‌న చేతిలో ఉన్న మ‌రో పెద్ద సినిమా ఇది. ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించ‌డం ఇదే తొలిసారి. ఉస్తాద్ త‌న కెరీర్‌కి బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్ అవుతోంద‌న్న భ‌రోసా శ్రీలీల మాట‌ల్లో క‌నిపిస్తోంది..!!

rajinikanth decided not to do ‘a’ rated movies!