
వర్క్ టైమింగ్స్ మీద రష్మిక మందన్న కామెంట్స్!
రష్మిక మాట్లాడుతూ..‘‘ఒక రోజులో నిర్ణీత సమయానికి మించి పనిచేయడం సరైంది కాదు. వ్యక్తిగతంగా నేను చాలా ఎక్కువ గంటలు పనిచేస్తాను. కంటి నిండా నిద్రపోయి చాలా నెలలు గడిచింది. కానీ, మీరు అలా చేయకండి. వీలైతే రోజుకు 9 నుంచి 10 గంటలపాటు నిద్రపోండి. సౌకర్యవంతమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుంది’’ అని తోటి నటీనటులకు సలహా ఇచ్చారు. సినిమా పరిశ్రమలో కూడా నిర్దిష్టమైన పనివేళలు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను..
ఇది కేవలం నటులకు మాత్రమే కాదు, దర్శకుల నుంచి సాంకేతిక సిబ్బంది వరకు అందరికీ వర్తించాలి. దానివల్ల ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరుకుతుంది. నేను కూడా నా కుటుంబంపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నాను. భవిష్యత్తు గురించే నా ఆలోచనలన్నీ. రేపు నేను తల్లి అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నాను’’ అని రష్మిక పేర్కొన్నారు..!!

