
తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల సమయంలో కొందరు సంబరాలు చేసుకున్నారంటూ ప్రముఖ నటి సమంత ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు, అనారోగ్య సమస్యలతో తాను తీవ్రంగా బాధపడుతుంటే, తనను ద్వేషించే వాళ్లు ఎగతాళి చేశారని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, “నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాను. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, మయోసైటిస్ బారిన పడినప్పుడు కొందరు పైశాచిక ఆనందం పొందారు. నా భవిష్యత్తుపై వారే నిర్ణయాలు తీసుకున్నట్లు మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు మొదట్లో నన్ను చాలా బాధపెట్టాయి, కానీ ఇప్పుడు అలాంటి వారిని పట్టించుకోవడం పూర్తిగా మానేశాను” అని స్పష్టం చేశారు..!!

