in

keerthy suresh opens up about delay for her wedding!

కీర్తి సురేశ్‌ తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ప్రేమించిన ఆంథోనీ తటిల్‌తో గతేడాది ఆమె వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, కాలేజీ రోజుల్లో మొదలైన తమ ప్రేమ పెళ్లి వరకు చేరడానికి ఏకంగా 15 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఆమె తాజాగా వివరించారు. ప్రముఖ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ఓ టాక్‌ షోలో కీర్తి తన ప్రేమ ప్రయాణం వెనుక ఉన్న కథను బయటపెట్టారు.

తామిద్దరం 2010లోనే, కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డామని కీర్తి సురేశ్‌ తెలిపారు. “అయితే, ముందు నా చదువు పూర్తి కావాలని భావించాను. అప్పటికి కెరీర్‌పై కూడా స్పష్టమైన ఆలోచన లేదు. జీవితంలో ఇద్దరం బాగా స్థిరపడిన తర్వాతే ఒక్కటవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్లి విషయంలో కావాలనే సమయం తీసుకున్నాం” అని ఆమె వివరించారు. ఈ నిర్ణయం ప్రకారమే ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి సారించినట్లు చెప్పారు..!!

Bhagyashri Borse All Praises For her costar Ram!

beauty Sreeleela playing a fiery undercover agent!