యువ కథానాయకుడు రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. వరుస పరాజయాల తర్వాత రామ్ ఈ సినిమాపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో, చిత్ర కథానాయిక భాగ్యశ్రీ బోర్సే.. హీరో రామ్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..
ఈ సినిమా కోసం రామ్ పడిన కష్టం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు భాగ్యశ్రీ తన పోస్టులో పేర్కొంది. “ప్రియమైన రామ్, ‘సాగర్’ పాత్రలో మీ మ్యాజిక్ అనుభూతి చెందడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం మీరు చేసిన కృషి, పడిన కష్టం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మీ అభిమానులకు ఓ పెద్ద విజయాన్ని అందిస్తుంది” అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ ఒక్క పోస్టుతో సినిమా కోసం రామ్ ఎంతలా శ్రమించాడో ఆమె స్పష్టం చేసింది..!!