in

rgv heroine naina ganguly abused by her boyfriend!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వంగవీటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నైనా గంగూలీ, తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. కొన్నేళ్లుగా తాను ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అతని చేతిలో శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే గత మూడేళ్లుగా తాను ఏ సినిమాలోనూ నటించలేకపోయానని వెల్లడించారు.

ఈ విషయంపై నైనా గంగూలీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. “కొన్ని వ్యక్తిగత విషయాలను మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చింది. నేను కొన్నేళ్లుగా కోల్‌కతాకు చెందిన ఒక కొరియోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నాను. కానీ, ప్రేమలో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ప్రతిరోజూ శారీరక, మానసిక హింస అనుభవిస్తున్నాను. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను” అని ఆమె ఆరోపించారు. తనను వేధిస్తున్న ఆ ప్రియుడి పేరును త్వరలోనే బయటపెడతానని కూడా ఆమె స్పష్టం చేశారు..!!

Real or Fake? Sai Pallavi Bikini Pics Examined

Real or Fake? Sai Pallavi Bikini Pics Examined

keerthy suresh as heroine, rajashekar villain for vd’s next!