ప్రస్తుతం రష్మికకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి. క్రిష్ 4 సినిమాతో ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన క్రిష్, క్రిష్ 3 సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక చోప్రా స్థానాన్ని రష్మిక భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న క్రిష్ 4 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి..
దీనితో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉండటం వల్ల ఆమెకు బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి సమయం దొరకడం లేదు. అందుకే సినిమా యూనిట్ కొత్త హీరోయిన్ కోసం చూసింది. ఈ క్రమంలో వారి దృష్టి రష్మిక మందనపై పడింది. హృతిక్ రోషన్, రష్మిక మందన ఇంతవరకు ఏ సినిమాలో కలిసి నటించలేదు. అందుకే ఈ కొత్త కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.!!