ధనుష్ హీరోగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇడ్లీ కొట్టు. విజయవంతమైన ‘తిరు’ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమిది. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘నా చిన్నతనంలో రోజూ ఇడ్లీ తినాలనిపించేది. కానీ, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. కానీ, నా చిన్నతనంలో ఇడ్లీ తినేప్పుడు ఉన్న ఆనందం, రుచి ఇప్పటి రెస్టరంట్‌లలో ఉండడం లేదు’ అంటూ ధనుష్ చెప్పడం ఆకట్టుకుంది. ధనుష్ ఇంకా మాట్లాడుతూ..‘ఇక ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది’ అని ధనుష్ తెలిపారు. అలాగే, తనను ట్రోల్ చేసేవారి గురించి కూడా ధనుష్ మాట్లాడారు.
‘అసలు ‘హేటర్స్’ అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే, అందరూ హీరోలందరి సినిమాలు చూస్తారు. ఎవరో 30 మంది ఒక టీమ్‌గా ఏర్పడి 300 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకొని..వారి మనుగడ కోసం కొందరు హీరోలపై కావాలని ద్వేషం వ్యక్తంచేస్తున్నారు. కానీ, ఆ 30 మంది కూడా సినిమా చూస్తారు’ అని ధనుష్ తెలిపారు..!!