in

Janhvi Kapoor keeps all her hopes on ram charan ‘peddi’!

సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా జాన్వి అకౌంట్లో మరో ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాపై చాలా బజ్ ఏర్పడింది.  బాగా ప్రమోట్ చేశారు కూడా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ఖాతాలో ఇప్పటికే చాలా ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరోటి కూడా చేరినట్టైంది.  ‘పరమ్ సుందరి’ని తుషార్ జలోటా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రెండు రాష్ట్రాల కథను చూపించారు..

‘పరమ్ సుందరి’ విడుదలయ్యే ముందు, ఈ సంవత్సరం ఉత్తమ రొమాంటిక్ కామెడీగా భావించారు, కానీ దీనికి విరుద్ధంగా జరిగింది.  కోయి మోయి నివేదిక ప్రకారం, ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.  ఇప్పటివరకు 50 కోట్ల మార్కును కూడా దాటలేదు. ప్రస్తుతం జాన్వికపూర్ ఆశలన్నీ రామ్ చరణ్  – బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిపైనే ఉన్నాయ్. ఈ మూవీ సక్సెస్ అయితే జాన్వి ఖాతాలో ఫస్ట్ బెస్ట్ హిట్ పడినట్టవుతుంది. మరి జాన్వి అదృష్టాన్ని చరణ్ మారుస్తాడేమో వెయిట్ అండ్ సీ..!!

malavika mohanan first-ever “audition” was conducted by Mammootty!