తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాళవిక, తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి మమ్ముట్టినే కారణమని తెలిపారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయినప్పటికీ, తనకు కూడా ఆడిషన్ తప్పలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. తన తొలి మలయాళ చిత్రం ‘పట్టంపోలే’ కోసం హీరోయిన్‌ను వెతుకుతున్న సమయంలో, ఒక షూటింగ్ లొకేషన్‌లో ఉన్న తనను మమ్ముట్టి చూశారని చెప్పారు..
ఆమె మాట్లాడుతూ, “అక్కడ నన్ను చూసిన మమ్ముట్టి గారు, వెంటనే నా ఫొటోలు తీశారు. సినిమా కోసం ఆడిషన్ కూడా ఆయనే చేశారు. అలాంటి గొప్ప నటుడి చేతుల మీదుగా ఆడిషన్ చేయించుకునే అదృష్టం ఎవరికి దక్కుతుంది? ఆయనే నన్ను చిత్రబృందానికి పరిచయం చేసి, నా మొదటి సినిమా అవకాశాన్ని ఇప్పించారు. అలా ఆయన వల్లే నా సినీ ప్రయాణం మొదలైంది” అని తన పాత జ్ఞాపకాలను వివరించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘పట్టంపోలే’ సినిమాతో మాళవిక కథానాయికగా పరిచయమయ్యారు..!!