గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ, “గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహ పడ్డాను. ఎప్పుడూ టాప్ 10 నటీనటుల జాబితాలో ఉండాలని, భారీ బ్లాక్బస్టర్లు అందుకోవాలని లెక్కలు వేసుకునేదాన్ని” అని సమంత గుర్తుచేసుకున్నారు..
అయితే, ఇప్పుడు తన ఆలోచనల్లో పూర్తి మార్పు వచ్చిందని సమంత స్పష్టం చేశారు. “గత రెండేళ్లుగా నేను సినిమాలు చేయలేదు. టాప్ 10 జాబితాలో కూడా లేను. నా దగ్గర రూ. 1,000 కోట్ల సినిమాలు లేకపోయినా, ఉన్నంతలో చాలా సంతోషంగా జీవిస్తున్నాను. ఒకప్పుడు నా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేస్తారేమోనని నిరంతరం భయపడేదాన్ని. నా ఆత్మగౌరవం మొత్తం ఆ నంబర్ల మీదే ఆధారపడి ఉందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాను” అని ఆమె తెలిపారు..!!