in

jr ntr’s next bollywood film kept on hold!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన బాలీవుడ్ చిత్రమే “వార్ 2”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ క్రేజీ మల్టీస్టారర్ యూనానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోనప్పటికీ 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. ఇక ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ సహా బాలీవుడ్ యాక్షన్ స్పై ఫ్రాంచైజ్ యష్ రాజ్ ఫిల్మ్స్ లో భాగం కూడా అవ్వడం జరిగింది..

అయితే తన ఎంట్రీ తోనే బాలీవుడ్ లో మరో సినిమాని కూడా తారక్ లాక్ చేసుకున్నట్టుగా ఆ మధ్య బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. కానీ ఇప్పుడు వార్ 2 ఫలితం తర్వాత తారక్ తో సోలో సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ ప్రాజెక్ట్ ని అందాకా మేకర్స్ హోల్డ్ లో పెట్టారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వార్ 2 ఫుల్ రన్ తర్వాత ఈ సినిమాపై ఓ నిర్ణయానికి మేకర్స్ రావచ్చని టాక్. మరి తారక్ నుంచి మరో బాలీవుడ్ సినిమా ఉందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి..!!

Rini Ann George ‘bad experience’ from young political leader!