in

Anupama reacts to criticism and reviewers about ‘paradha’!

టీవల విడుదలైన ‘పరదా’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అనుపమ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కొంతమంది వినోదాత్మక చిత్రాలను ఇష్టపడితే, మరికొందరు కథాబలం ఉన్న సినిమాలను ఆదరిస్తారని అనుపమ తెలిపారు. ‘పరదా’ చిత్రాన్ని తాను ఎంతో ఇష్టపడి చేశానని..

అయితే కొందరు దీనిని ప్రయోగాత్మక చిత్రం అని చెబుతూనే అందులో లోపాలను వెతకడంపై దృష్టి పెడుతున్నారని  అన్నారు..”కమర్షియల్ చిత్రాల్లో వెయ్యి తప్పులున్నా ఎవరూ ప్రశ్నించరు. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయానికి వచ్చేసరికి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ ఇలాంటి ధోరణులే కనిపిస్తుంటాయి. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే సగం మంది విమర్శిస్తుంటారు. మేం పడిన కష్టాన్ని గుర్తిస్తే ఇలాంటి కొత్త కథలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది” అని ఆమె విజ్ఞప్తి చేశారు..!!

pooja hegde desperate for a solid comeback in telugu!

Rini Ann George ‘bad experience’ from young political leader!