
గత 20 ఏళ్ల తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ప్రముఖ నటి రెజీనా కసాండ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇన్ని భాషల్లో విభిన్నమైన అవకాశాలు రావడం నా అదృష్టం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది. మొదట్లో నాకు సరైన మార్గదర్శకులు ఎవరూ లేరు. ఎన్నో సందేహాలు, సవాళ్లు ఎదుర్కొన్నాను. కానీ, సొంతంగా ఒక్కో విషయం నేర్చుకున్నా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలన్నదే నా కోరిక. నన్ను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేయకపోవడం వల్లే నటిగా ఎదగగలిగాను” అని రెజీనా వివరించారు.
