in

kangana ranaut doesn’t believe in marriage relation!

విషయంపై ఆమె మాట్లాడుతూ, “నా పెళ్లి గురించి ఇప్పటివరకు వందల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏదీ నిజం కాదు. నేను పెళ్లిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వివాహం, కుటుంబం, పిల్లలు అనేవి నా జీవనశైలికి సరిపోవు. వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు” అని స్పష్టం చేశారు. పెళ్లి కావడం లేదన్న బాధ తనకు ఏమాత్రం లేదని కూడా ఆమె అన్నారు. “ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలు, రాజకీయాలపైనే ఉంది..

ఈ రెండు రంగాల్లోనే నాకు పూర్తి సంతృప్తి లభిస్తోంది” అని కంగన తన ప్రాధాన్యతలను వివరించారు. నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పే కంగనా, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎప్పటిలాగే కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే, ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని కంగన తన వైఖరితో చెప్పకనే చెప్పినట్లయింది..!!

f cube ‘Kiara Advani’!