అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’లో రాజమాత శివగామి పాత్రలో అద్భుతమైన నటన కనబరచడం మాత్రమే కాదు…సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు రమ్యకృష్ణ. ఇప్పుడు ఆమెను అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కీలక పాత్రకు తీసుకున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, సాయి దుర్గా తేజ్ తదితరుల సినిమాలలో రమ్యకృష్ణ నటించారు. బన్నీ, ఆవిడ కాంబినేషన్‌లో ఫస్ట్ సినిమా ఇది.
సైన్స్ ఫిక్షన్ కథతో అల్లు అర్జున్ అట్లీ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ఆవిడ కాకుండా మరొక ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. ఒక పాత్రకు మృణాల్ ఠాకూర్, మరొక హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి..!!