in

Anupama reveals about her lilly character reflection!

టిల్లు స్క్వేర్‌లో లిల్లీ పాత్రలో కనిపించిన అనుపమ..ఆ పాత్ర పై తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంది. సాధారణంగా గ్లామరస్ రోల్ కు దూరంగా ఉండే అనుపమకు..ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదని వివరించింది. లిల్లీ పాత్రను అంగీకరించడానికి నేను చాలా సమయం ఆలోచించానంటూ చెప్పుకొచ్చిన అనుపమ..షూటింగ్ ప్రమోషన్స్ టైం లో కూడా ఆ పాత్రకు తగ్గట్లుగా నేను డ్రస్స్‌లు వేసుకోవడానికి చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా. ఆ పాత్రకు ప్రేక్షకులు నుంచి విమర్శలు వస్తాయని ముందే ఊహించా అంటూ చెప్పుకొచ్చింది.

సినిమా రిలీజ్ అయ్యాక అదే జరిగింది. అయితే.. తర్వాత అందరూ నా నటనను, పాత్రను ప్రశంసించడంతో ఎంతో సంతోషంగా అనిపించిందంటూ ఆమె వివరించింది. టిల్లు స్క్వేర్ సినిమా తన కెరీర్‌లో ముఖ్యమైన మలుపు అంటూ వివరించిన ఆమె.. తనకు ఈ సినిమా కొత్త అనుభవాన్ని ఇచ్చిందని.. భవిష్యత్తులో ఎలాంటి విభిన్నమైన రోల్స్ అయ్యినా చేయడానికి ప్రేరణగా మారింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి..!!

Shilpa Shetty, Raj Kundra Charged With Cheating Businessman case!