హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘తమ్ముడు’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నితిన్ ఫెయిల్యూర్ ట్రాక్ కొనసాగుతోంది. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని ‘ఇష్క్’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాను స్పోర్స్ట్ డ్రామాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. కాగా ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడింగ్ చేస్తూ కనిపిస్తాడట..
దానికోసం ఆయన గుర్రపుస్వారి నేర్చుకుంటున్నాడట. ఇక ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. దీంతో నితిన్‌తో పూజా తొలిసారి నటిస్తుండటంతో ఈ పెయిర్ కొత్తగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది..!!