in

south Actor Apologizes to Tamannaah over his behavior!

చిన్న వయసులోనే తాను ఇండస్ట్రీకి వచ్చానని..కెరీర్ తొలినాళ్లలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. చిన్న వయసులో ఇండస్ట్రీకి రావడం వల్ల తనకు ఏమీ తెలియదని అనుకునేవారని..తన విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసేవారని తెలిపింది. తనను అవమానించేందుకు కూడా యత్నించారని చెప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే దక్షిణాదికి చెందిన ఒక పెద్ద స్టార్ తో నటించే అవకాశం వచ్చిందని..

ఆయనతో నటించేటప్పుడు కొన్ని సన్నివేశాల్లో అసౌకర్యంగా అనిపించిందని తెలిపింది. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పానని..అప్పుడు ఆ హీరో ‘హీరోయిన్ ను తీసేయండి’ అంటూ సెట్ లో గట్టిగా కేకలు వేశాడని చెప్పింది. అయితే, ఆ మరుసటి రోజు తనంతట తానే తన వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడని వెల్లడించింది. తనకు కోపం వచ్చిందని..అందుకే అరిచానని చెప్పాడని తెలిపింది. తనతో అలా ప్రవర్తించినందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడని చెప్పింది..!!

Vadde Naveen’s Re-entry with ‘Transfer Trimurthulu’!

Kiara advani’s bikini scenes trimmed in war 2!