గత కొద్ది కాలంగా పలు కార్యక్రమాల్లో ధనుశ్, మృణాల్ కలిసి కనిపించడంతో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ చిత్ర స్క్రీనింగ్‌కు ధనుశ్ హాజరుకావడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీనిపై మృణాల్ వివరణ ఇస్తూ, “ఆ కార్యక్రమానికి ధనుశ్‌ను అజయ్ దేవగణ్ గారు ఆహ్వానించారు..
ఆయన ఆహ్వానం మేరకే ధనుశ్ వచ్చారు. దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని కోరారు. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ఈవెంట్‌కు ముదు, ధనుశ్ నటిస్తున్న ‘తేరే ఇష్క్ మే’ సినిమా ర్యాప్-అప్ పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. ఈ రెండు సందర్భాల్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, మృణాల్..ధనుశ్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది.!!