in

tamannah bhatia reacts to relationship linkup rumors!

కేవలం వ్యూస్ కోసం సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, రూమర్లు నిత్యకృత్యంగా మారాయి. ఈ క్రమంలోనే, నటి తమన్నా భాటియా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్‌పై తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది. తనపై వస్తున్న రూమర్లను ఆమె ఖండించింది. సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్ సృష్టించబడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ఒక నగల దుకాణం ప్రారంభోత్సవానికి అబ్దుల్‌తో కలిసి హాజరైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. అలాగే, విరాట్ కోహ్లీతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు వచ్చిన రూమర్స్‌పై కూడా తమన్నా స్పందించారు. తాను విరాట్‌ను ఒకసారి మాత్రమే కలిశానని, ఆ సమయం నుంచి ఇలాంటి ప్రచారం జరగడం బాధ కలిగించిందని అన్నారు. ఆ తర్వాత మళ్లీ కోహ్లీని కలుసుకోలేదని తమన్నా తేల్చి చెప్పారు..!!

sequel confirmed for balakrishna ‘Aditya 369’ soon!