హ్రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 రికార్డు
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా ‘వార్-2’. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇప్పటికే విడులైన టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ సినిమా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. సినిమాను దేశవ్యాప్తంగా డాల్బీ అట్మోస్ ధియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది..
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాశ్ రాజ్ ఫిల్మ్స్ వెల్లడించింది. యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులకి సినిమా మంచి అనుభూతి ఇస్తోందని చెప్తోంది. దేశంలో ఇలా ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా ‘వార్-2’ నిలుస్తుందని చెప్తోంది టీమ్. ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధి సంఖ్యలో డాల్బీ అట్మోస్ లోనే ప్రదర్శించనున్నట్టు పేర్కొంటోంది. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ ఖర్చుతో సినిమా తెరకెక్కింది..!!