దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్‌ను బయటపెట్టిన నాని – అదే కాంబినేషన్‌లో మళ్లీ అడుగుపెడుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ‘ది ప్యారడైజ్’గా ఖరారు చేశారు. నానితో పాటు ఇందులో ఇద్దరు హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఒకవైపు భాగ్యశ్రీ బోర్సే, మరోవైపు ఇటీవలే ‘డ్రాగన్’ సినిమాతో పాపులర్ అయిన కాయాదు లోహర్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కాయాదు లోహర్ ఈ సినిమాలో ఓ వేశ్య పాత్రలో నటించబోతుందట..
ఈ క్యారెక్టర్ చాలా లోతుగా, భావోద్వేగంతో నడిచే పాత్రగా ఉంటుందని టాక్ . గ్లామర్ తో పాటు సున్నితమైన ఎమోషన్స్‌కు ఈ పాత్రకు స్పేస్ ఉండబోతుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ. ఇది నాని పాత్ర కు కూడా మానవతా కోణాన్ని చూపించేలా ఉండొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి .ఇక నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయినట్టు. ‘దసరా’ తరహాలోనే గ్రామీణ బ్యాక్‌డ్రాప్ , మాస్ పాత్రలు ఈ సినిమా కు హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..!!