వయసుతో పాటు ఈమె అందం కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం తమన్నా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపుగా 10 కి పైగా స్పెషల్ సాంగ్స్ లో చేసింది. జైలర్ సినిమాలో నువ్వు కావాలయ్యా అనే సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే. అలాగే 2024లో స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ సాంగ్ లో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేసింది..
అయితే తాజాగా తమన్నా మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ది రాజా సాబ్. ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో కలిసి తమన్నా డ్యాన్స్ చేయనున్నారట. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు..!!