భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, యూట్యూబర్ ధనశ్రీ వర్మ ‘బిగ్‌బాస్ 19’లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనాల్సిందిగా బిగ్‌బాస్ టీం ఆమెను సంప్రదించినట్టు సమాచారం. ‘బిగ్ బాస్’కు సంబంధించిన ఒక ఇన్‌సైడర్ పేజీలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. ధనశ్రీ వర్మ ‘బిగ్ బాస్ 19’లో పాల్గొనడం దాదాపు నిశ్చయమైనట్టు తెలుస్తోంది. గతంలో ఆమె ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ కోసం కూడా ఎంపికైంది, కానీ ఆ షో రద్దయింది. ఇప్పుడు ధనశ్రీ ‘బిగ్ బాస్’ ఆఫర్‌ను అంగీకరించినట్టు సమాచారం..
ఈ షోలో ధనశ్రీతో పాటు ఇతర ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ‘ఇండియన్ ఐడల్ 5’ ఫేమ్ గాయకుడు-నటుడు శ్రీరామ చంద్ర కూడా ఉన్నారు. ‘బిగ్ బాస్ 19’ ఈ ఏడాది అత్యంత ఎక్కువ కాలం నడిచే సీజన్‌గా రికార్డు సృష్టించనుందని, ఆగస్టు చివరి వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ధనశ్రీ, చాహల్ 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. 2023లో వారి బంధంలో సమస్యలు వచ్చి విడిపోయారు..!!