విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్ డమ్’ సినిమాజూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తన పేరుకు ముందు ఉన్న ట్యాగ్స్ పై స్పందించారు. ముఖ్యంగా ఆమధ్య ‘విజయ్ దేవరకొండ’ పేరుకు ముందు ‘ది’ చేర్చడం.. అది వివాదాస్పదం కావడంపై మాట్లాడారు. ‘సినిమాల్లో ప్రతి హీరోకీ యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ అంటూ ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి. నాకే ఏ ట్యాగ్ లేదనుకుంటా.
‘లైగర్’ రిలీజ్ కి ముందు నన్ను రౌడీ స్టార్, సదరన్ స్టార్ అని అభిమానులు పిలిచేవారు. అందుకు నేను అంగీకరించలేదు. దీంతో ‘లైగర్’ టీమ్ నా పేరు ముందు ‘ది’ చేర్చింది’..‘అయితే..ఏ ట్యాగ్ లేదుకదా అని అంగీకరించాను. కానీ.. ఆ ట్యాగ్ ఎన్నో వివాదాలకు వేదికైంది. ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో తీసేయమని నా టీమ్ కి చెప్పాను. ఎప్పటిలా పేరుతోనే పిలవాలని చెప్పా. దానివల్ల ఎవరూ ఎదుర్కోనన్ని విమర్శలు ఎదుర్కొన్నా’నని చెప్పుకొచ్చారు..!!