శ్రీలీలకి వరుసగా బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయట. అక్కడి ఫిలిం మేకర్స్ శ్రీలీలకి అడిగినంత పారితోషికం ఇస్తున్నారట. దీంతో తెలుగులో కూడా ఆమె అలానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం… శ్రీలీల ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.7 కోట్లు డిమాండ్ చేస్తుందట. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నట్టు తెలుస్తుంది. హిందీలో ఆమె నటిస్తున్న ‘ఆషికి 3’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి రూ.5 కోట్ల వరకు అందుకున్నట్టు తెలుస్తుంది.
కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడు పారితోషికం పెంచడం సహజమే అయినా, సక్సెస్ రేటు తక్కువగా ఉన్న ఈ తరుణంలో ఏకంగా రూ.7 కోట్లు డిమాండ్ చేయడం కొంచెం ‘అతి’కి పోవడమే అని ఇండస్ట్రీ జనాలు అభిప్రాయ పడుతున్నారు. లైఫ్ ఇచ్చిన తెలుగు సినీ పరిశ్రమని పక్కన పెట్టి బాలీవుడ్‌పై మోజుతో వెళ్లిన చాలా మంది హీరోయిన్లు అక్కడ రాణించలేక.. ఇక్కడ ఉన్న మార్కెట్ ను కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి శ్రీలీల కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి..!!